🏠 mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 16 September 2026, 4:45 pm Posted by : RK SAKSHI

మెగా ఉద్యోగ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి.. సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్..

News Image




సూర్యాపేట: ఈ నెల 19వ తేదీన కోదాడ పట్టణంలోని సిసి రెడ్డి కాన్వెంట్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో, గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో నిర్వహించనున్న మెగా ఉద్యోగ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని, అవకాశాలను విజయాలుగా మార్చుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహా ఐపీఎస్ సూచించారు. ఈ సందర్భంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు మెగా ఉద్యోగ మేళాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగ మేళాకు సంబంధించిన అవగాహన పోస్టర్‌ను ఎస్పీ నరసింహా ఐపీఎస్ గారు అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
మెగా ఉద్యోగ మేళాలో వివిధ రంగాలకు చెందిన 300 వరకు ప్రముఖ సంస్థలు పాల్గొని ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నందున, విద్యార్థులు, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. ఉద్యోగ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగానే స్కానర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. యువత తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను పరిశీలించి, తగిన ఉద్యోగాన్ని సాధించేందుకు ఈ మెగా ఉద్యోగ మేళాను ఒక మంచి అవకాశంగా వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, కళాశాల ప్రినిస్పాల్ ముత్యాలరాజు, ఉపాధ్యాయులు, పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home