నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి. సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్
సూర్యాపేట రూరల్ :
ఈ నెల 19న కోదాడలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ కోరారు. బుధవారం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో మెగా జాబ్ మేళా గూర్చి ప్రచారంలో భాగంగా ఆటో రిక్షాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ... వందలాది ప్రముఖ కంపెనీలు పాల్గొననున్న జాబ్ మేళాకు నిరుద్యోగ యువత హాజరై ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట రూరల్ సీఐ ఆంజనేయులు, సూర్యాపేట రూరల్ ఎస్ ఐ ఎన్. అనిల్ రెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.