🏠 mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 17 September 2026, 10:18 am Posted by : RK SAKSHI

త్యాగధనుల స్ఫూర్తితో ప్రజా పాలనను మరింత బలోపేతం చేద్దాం

News Image
ముఖ్యమైన పాయింట్స్:తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా డీసీసీ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ

సూర్యాపేట : సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించగా ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాలు, అనేక పోరాటాల స్ఫూర్తితో రాచరిక పాలన నుంచి విముక్తి పొంది భారత యూనియన్‌లో విలీనమైన తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ఆ చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు.స్వేచ్ఛ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రజల గౌరవం, హక్కులు, సంక్షేమాన్ని కాపాడుతూ, ప్రజల భాగస్వామ్యంతో, పారదర్శకతతో, సమానత్వంతో కూడిన ప్రజా పాలనను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్యాగధనుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేరేలా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అందరం కలిసికట్టుగా పనిచేసి తెలంగాణను మరింత ప్రగతిపథంలో నడిపిద్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కక్కిరేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home