🏠 mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 17 September 2026, 7:10 pm Posted by : M TODAY NEWS

బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు శుభవార్త.. 20న విజయవాడ-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

News Image
శ్రీవారి బ్రహ్మోత్సవాలు, గరుడ సేవ నేపథ్యంలో తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం సెప్టెంబర్ 20వ తేదీన విజయవాడ - తిరుపతి మధ్య ఒక ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
రైళ్ల రాకపోకల సమయాలను పరిశీలిస్తే.. తిరుపతి - విజయవాడ ప్రత్యేక రైలు (నెంబర్ 07606) సెప్టెంబర్ 20న తెల్లవారుజామున 1:15 గంటలకు తిరుపతిలో బయలుదేరి, అదే రోజు ఉదయం 8:00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ - తిరుపతి ప్రత్యేక రైలు (నెంబర్ 07605) అదే రోజు ఉదయం 9:00 గంటలకు విజయవాడలో బయలుదేరి, సాయంత్రం 4:45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మార్గమధ్యంలో ఈ రెండు రైళ్లు రేణిగుంట జంక్షన్, శ్రీకాళహస్తి, గూడూరు జంక్షన్, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ ప్రత్యేక రైలులో మొత్తం 22 కోచ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 16 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, 4 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 2 ఎస్‌ఎల్‌ఆర్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. వారాంతం కావడంతో పాటు శ్రీవారి దర్శనార్థం వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సేవలను సద్వినియోగం చేసుకుని తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
🏠 Home