21, 22 తేదీల్లో కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
ముఖ్యమైన పాయింట్స్:హంద్రీ-నీవా కాలువ వద్ద జలహారతిరైతు బజార్‌కు శంకుస్థాపన, పలు ప్రాజెక్టుల ప్రారంభంకుప్పంలో దాదర్ - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్ సిగ్నల్
కుప్పం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 21, 22 తేదీల్లో తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సెప్టెంబర్ 21న బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి శాంతిపురం మండలం తుమ్సి గ్రామానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి గుండిశెట్టిపల్లి వద్ద ఉన్న హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీ-నీవా) కాలువ వద్దకు వెళ్లి జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగానిపల్లిలో నూతన రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం కుప్పం కొత్తపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, సంబంధిత గ్యాలరీని పరిశీలిస్తారు. అదే రోజు రాత్రి కుప్పం రైల్వేస్టేషన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని, దాదర్ - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ (11005) రైలు సర్వీసును ముఖ్యమంత్రి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు.
22న హెచ్ఏఎం (HAM) ప్రాజెక్టులకు శ్రీకారం:
పర్యటనలో రెండవ రోజైన సెప్టెంబర్ 22న శాంతిపురం మండలంలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో చేపట్టనున్న హెచ్ఏఎం (HAM) ప్రాజెక్టులకు సీఎం శ్రీకారం చుడతారు. అలాగే ఈసీ పౌల్ట్రీ షెడ్లను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం సాయంత్రం తుమ్సి హెలిప్యాడ్ నుంచి తిరిగి బెంగళూరుకు పయనమవుతారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని, సాయంత్రం 6.20 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోవడంతో ముఖ్యమంత్రి పర్యటన ముగుస్తుంది.