సంతోష్ రావు నీ బినామీనా? ఆ వేల కోట్లు ఎలా వచ్చాయి?
ముఖ్యమైన పాయింట్స్:వందల ఎకరాల ఆస్తిలో మా వాటా ఎక్కడ కేటీఆర్?సొంత అన్న బిడ్డలైన నన్ను, కవితను పక్కనపెట్టి.. సంబంధం లేని సంతోష్‌కు పెద్దపీట ఎందుకు?ఆస్ట్రేలియాలో వెయ్యి ఎకరాల ఎస్టేట్.. ఫామ్‌హౌస్‌లో డైమండ్స్?గాంధీభవన్‌లో కేసీఆర్ సొంత అన్న కూతురు సంచలన ఆరోపణలు
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు సెక్షన్ 22-A అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ సొంత అన్న కూతురు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాతల కాలం నుంచే తమకు వందల ఎకరాల భూములు ఉన్నాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆమె దీటుగా కౌంటర్ ఇచ్చారు. గురువారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేటీఆర్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ల ఆస్తులపై సంచలన ఆరోపణలు చేశారు.
"కేటీఆర్.. రాఘవరావు గారికి మనమిద్దరం మనవళ్లమే. నేను మీ సొంత పెద్దనాన్న బిడ్డను. వందల ఎకరాల ఆస్తి ఉందని చెబుతున్నావు కదా.. అందులో నా వాటా భూమి ఎక్కడ ఉంది?" అని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఇంటి ఆడబిడ్డలమైన తనను, కవితను పక్కనపెట్టి, కుటుంబంతో ఎలాంటి సంబంధం లేని జోగినపల్లి సంతోష్ రావును కేసీఆర్ తన దగ్గర ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించిన సంతోష్ రావు.. అక్కచెల్లెళ్లను ఇంటి నుంచి బయటకు పంపిస్తుంటే కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని, సంతోష్ రావు నీకు బినామీనా? అతనంటే నీకు ఎందుకు అంత భయం? అని ఆమె నిలదీశారు.
చెప్పులు లేని స్థాయి నుంచి కోట్ల ఆస్తుల వరకూ..
గతంలో కరీంనగర్లో ఉన్నప్పుడు కనీసం వేసుకోవడానికి చెప్పులు కూడా లేని, ఒక చిన్న సింగిల్ బెడ్ రూమ్ ఇంట్లో అద్దెకు ఉన్న సంతోష్ రావుకు నేడు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు. ఇంట్లో పనిచేసే పిల్ల డబ్బులు సైతం గుంజుకున్న చరిత్ర అతడిదన్నారు. 2013లో ఓ క్వారీలో 25 శాతం వాటా ఉన్న సంతోష్.. 2015లో ప్రాజెక్టు ముంపు కింద అక్రమాలకు పాల్పడ్డాడన్నారు. ఓసీ కేటగిరికి చెందిన సంతోష్ బీసీ అని తప్పుడు ధ్రువీకరణతో గ్రామానికి ఎలాంటి సంబంధం లేకపోయినా కుదురుపాకలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఏకంగా 8 ప్లాట్లు తీసుకున్నారని ఆరోపించారు. కానీ 2018 రాజ్యసభ ఎన్నికల అఫిడవిట్లో మాత్రం తనకు ఒక్క ప్లాటు మాత్రమే ఉన్నట్లు తప్పుగా చూపించారన్నారు.
భారీగా బినామీ ఆస్తులు.. ఆస్ట్రేలియాలో ఎస్టేట్!
సంతోష్ రావు అక్రమ ఆస్తుల చిట్టాను ఆమె మీడియా ముందు ఏకరువు పెట్టారు. మర్కుక్ గ్రామంలో 9 ఎకరాల భూమి, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో భూమి, ఇల్లు ఎలా వచ్చాయని నిలదీశారు. 2018 తర్వాత కొండాపూర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో ఆస్తులు ఎలా కూడబెట్టారని ప్రశ్నించారు. సంతోష్ రావు భార్య రోహిణి పేరు మీద నానక్‌రామ్‌గూడలో రూ.21.40 కోట్ల విలువైన కమర్షియల్ భవనం ఉందని, సిరిసిల్ల జిల్లా వర్ధపల్లి గ్రామంలో మెయిన్ రోడ్డుపై తండ్రి రవీందర్ రావు పేరున 2 ఎకరాల భూమి ఉందన్నారు.
ఉద్యమం ముసుగులో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని, చిన్న షాపూర్లో ఫామ్ హౌస్‌తో పాటు దేశ, విదేశాల్లో భారీగా ఆస్తులు పోగేసుకున్నారని ఆరోపించారు. ఆస్ట్రేలియాలో ఏకంగా 1,000 ఎకరాల్లో 'జేఎస్ రాజ్ ఎస్టేట్' ఉందని, వెన్నమనేని శ్రీనివాస్ రావు అనే బినామీ ద్వారా హవాలా రూపంలో ఆస్తులు దాచిపెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్ భూముల్లో కీలక డాక్యుమెంట్లు, డైమండ్స్ దాచిపెట్టారని, ప్రభుత్వం వాటిని సీజ్ చేయకముందే.. బీఆర్ఎస్ నేతలు స్వచ్ఛందంగా ఆస్తులను ప్రజలకు అప్పగించి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు బయటకు రాకుండా దుబాయ్ నుంచి సోషల్ మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.