కూతురి పెళ్లిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాల్సిన ఖర్మ నాకు లేదు!
ముఖ్యమైన పాయింట్స్:పార్టీ మారుతున్నాననేది శుద్ధ అబద్ధం.. దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన వైఎస్ షర్మిల
తాను పార్టీ మారుతున్నట్లు, ఎవరితోనో తెరవెనుక మంతనాలు సాగిస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ కేవలం కట్టుకథలేనని, ఆ విశ్లేషణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. గిట్టనివారు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఈ పసలేని ఆరోపణలను, అబద్ధాలను ఆమె తీవ్రంగా ఖండించారు. తన కుమార్తె పెళ్లి పిలుపును రాజకీయాలతో ముడిపెట్టడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
తన సోదరుడు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గతంలో తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించేందుకే చివరిసారిగా కలిశానని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందించడానికి మాత్రమే మళ్లీ కలుస్తానని, అందులో పెళ్లి పిలుపు తప్ప ఎలాంటి రాజకీయ ఉద్దేశం ఉండబోదని తేల్చి చెప్పారు. ఒక తల్లిగా ఇంట్లో జరిగే శుభకార్యానికి అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానించడం, ఆశీస్సులు కోరడం ఆనవాయితీ అని, ఇందులో రాజకీయ వింత గానీ, కొత్తదనం గానీ లేదని స్పష్టం చేశారు.
వైఎస్సార్ బిడ్డగా ఆ ఖర్మ పట్టలేదు..
"కన్న కూతురి వివాహాన్ని అడ్డుపెట్టుకుని తెరవెనుక రాజకీయాలు చేసుకోవాల్సిన ఖర్మ వైఎస్సార్ బిడ్డగా నాకు పట్టలేదు" అని షర్మిల ఘాటుగా వ్యాఖ్యానించారు. కుటుంబ శుభకార్యానికి రాజకీయాలు ఆపాదిస్తూ, తన విశ్వసనీయతను, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీయాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజకీయ భేషజాలను పక్కనపెట్టి కుటుంబ బాధ్యతగా పెళ్లికి పిలిస్తే, దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూడటం హేయమైన చర్య అన్నారు.
తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహ మహోత్సవానికి తెలుగు ప్రజలందరూ హాజరై, ఒకటవుతున్న నవదంపతులను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా షర్మిల కోరారు. బెంగళూరు భేటీ తర్వాత ఆమె కాంగ్రెస్కు రాజీనామా చేసి మళ్లీ వైసీపీతో చేతులు కలుపుతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారానికి షర్మిల తాజా ప్రకటనతో ఫుల్స్టాప్ పెట్టినట్లయింది.