టాలీవుడ్‌కు గుడ్‌న్యూస్.. మళ్లీ మొదలుకానున్న 'నంది' సందడి!
ముఖ్యమైన పాయింట్స్:2012 నుంచి పెండింగ్‌లో ఉన్న అవార్డుల ప్రదానానికి సర్కార్ సన్నాహాలు - అమరావతిలో చలనచిత్ర, తిరుపతిలో టీవీ పురస్కారాల వేడుక - నవంబర్‌లోనే జ్యూరీల ఎంపిక, విజేతల ప్రకటన
తెలుగు సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'నంది' అవార్డుల ప్రదానోత్సవానికి మళ్లీ కదలిక వచ్చింది. ఏళ్లుగా నిలిచిపోయిన ఈ పురస్కారాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2012 నుంచి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న అవార్డులతో పాటు, 2025 సంవత్సరానికి సంబంధించిన అవార్డుల ప్రక్రియను కూడా ఏకకాలంలో నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఉత్తమ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు ఇచ్చే ఈ పురస్కారాలు కొంతకాలంగా నిలిచిపోవడంతో సినీ వర్గాల్లో తీవ్ర నిరాశ నెలకొంది. తాజా నిర్ణయంతో అవార్డుల కోసం ఎదురుచూస్తున్న సినీ ప్రముఖులు, అభిమానుల్లో సర్వత్రా ఉత్సాహం వ్యక్తమవుతోంది.
నవంబర్‌లో తొలి విడత.. డిసెంబర్ 2026లో భారీ వేడుకలు
2012 నుంచి 2016 వరకు పెండింగ్‌లో ఉన్న నంది, జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవాన్ని ఈ నవంబర్‌లో విజయవాడలో నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఆ తర్వాత 2017 నుంచి 2024 వరకు, అలాగే 2025 సంవత్సరానికి సంబంధించిన అవార్డుల ప్రదానానికి రంగం సిద్ధం చేయనుంది. చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవాన్ని అమరావతి లేదా విజయవాడలో అత్యంత భారీ స్థాయిలో నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. అలాగే నంది టీవీ అవార్డుల కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ రెండు బృహత్తర కార్యక్రమాలను 2026 డిసెంబర్‌లో ఘనంగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నవంబర్‌లోనే జ్యూరీల ఎంపిక.. 46 విభాగాల్లో పురస్కారాలు
దశాబ్ద కాలం నాటి అవార్డుల ఎంపిక కోసం ప్రత్యేక జ్యూరీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. నవంబర్‌లో జ్యూరీల ఆధ్వర్యంలో సినిమాల పరిశీలన, ఎంపికను వేగవంతం చేయనున్నారు. 2017 నుంచి 2025 వరకు సంబంధించిన విజేతల జాబితాను సైతం నవంబర్‌లోనే ప్రకటించే అవకాశం ఉంది. చలనచిత్ర విభాగంలో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, నటి, సహాయ నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రత్యేక గుర్తింపులు కలుపుకుని మొత్తం 46 విభాగాల్లో ఈ అవార్డులను అందించనున్నారు. ఏళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డుల పునరాగమనంతో తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి పండుగ వాతావరణం నెలకొననుంది.