జగన్‌తో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దశరథరామిరెడ్డి భేటీ: స్థానిక ఎన్నికల వేళ రాజకీయ ప్రాధాన్యం
తాడేపల్లి: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పాలచూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలూరు దశరథరామిరెడ్డి గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌మోహన్‌రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు.
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా తిరుపతి జిల్లాలోని నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో పార్టీ పరిస్థితి, ఎన్నికల సన్నద్ధతపై అధినేతతో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ఈ రెండు మండలాల్లో చురుకైన నాయకుడిగా ప్రజలకు సేవలందిస్తున్న దశరథరామిరెడ్డి.. రాబోయే స్థానిక పోరులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిన విధానం, పోటీకి సంబంధించిన పలు కీలక అంశాలను జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఆయన భేటీ ఆయా ప్రాంతాల్లో ఆసక్తికరంగా మారింది.
అయితే, స్థానికంగా జరుగుతున్న ఈ రాజకీయ ఊహాగానాలపై పాలూరు దశరథరామిరెడ్డి స్పందించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాను కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అధినేత ఆశీస్సులు తీసుకునేందుకే తాను వెళ్లానని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి తనవంతు బాధ్యతగా పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.