వైభవంగా శ్రీవారి దర్శనాలు.. రూ.29 కోట్లకు చేరిన హుండీ ఆదాయం
తిరుమల: తిరుమల గిరులకు విచ్చేసిన ప్రతి భక్తుడికీ మూలవిరాట్టు దర్శనంతో పాటు, వాహన సేవల్లో మలయప్ప స్వామి దర్శన భాగ్యం కల్పించినట్లు టీటీడీ చైర్మన్ వెల్లడించారు. బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ ఈవో రవిచంద్ర తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు స్వామివారిని మొత్తం 5.76 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, హుండీ ద్వారా రూ.29 కోట్ల ఆదాయం లభించిందని ఆయన వివరించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేశామని, ఈ వ్యవధిలో 21.80 లక్షల మందికి అన్నప్రసాదాలు అందించగా, 2.04 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని తెలిపారు. రికార్డు స్థాయిలో 33 లక్షల లడ్డూలను విక్రయించినట్లు వెల్లడించారు.
వాహన సేవల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం నుంచి వచ్చిన 295 కళా బృందాలకు చెందిన దాదాపు 7,871 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో అలరించారు. ముఖ్యంగా తొలిసారిగా జర్మనీ, సింగపూర్ దేశాల నుంచి వచ్చిన కళా బృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 4 వేల మంది శ్రీవారి సేవకులు నిరంతరం సేవలందించారని చైర్మన్ కొనియాడారు. భద్రతా పరంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3 వేల మంది పోలీసులు, 2,400 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్ట చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో భక్తులకు మరింత మెరుగైన వసతులు, ఆధ్యాత్మిక అనుభూతిని అందించే దిశగా పలు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు ఆయన ప్రకటించారు. తిరుమలలో అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఎస్వీ మ్యూజియాన్ని మరో రెండు రోజుల్లో భక్తుల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అలాగే తిరుమల, తిరుపతి పరిధిలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో 'వృక్ష గోవిందం' అనే నూతన కార్యక్రమాన్ని త్వరలోనే బృహత్తరంగా చేపట్టనున్నట్లు చైర్మన్ ఈ సందర్భంగా వెల్లడించారు.