🏠 mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 28 September 2026, 7:41 am Posted by : M TODAY NEWS

మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త

News Image
టెలికాం వినియోగదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. ప్రస్తుతం చాలా టెలికాం కంపెనీలు 28 రోజుల వ్యాలిడిటీతో మాత్రమే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. దీని వల్ల నెలకు ఒకసారి చొప్పున రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు ఏడాదికి 12 సార్లకు బదులుగా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోంది. ఈ భారాన్ని తగ్గించేందుకు, ప్రత్యామ్నాయంగా పూర్తి నెల (30 రోజులు) వ్యాలిడిటీ ఆప్షన్లను తప్పనిసరిగా అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం సంస్థలను ఆదేశించింది.

కొత్త ఫోన్ కొంటే.. ఆరు నెలల జియో రీచార్జ్ ఫ్రీ!

కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 20 (2026) మధ్య కొత్త ఫోన్ కొనుగోలు చేసే జియో వినియోగదారులకు ఆరు నెలల పాటు ఉచిత రీచార్జ్‌ను అందించనున్నట్లు సంస్థ పేర్కొంది.

రైల్వే యూపీఐ చెల్లింపుల్లో కీలక మార్పులు

ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు 2026 అక్టోబర్ 15 నుంచి కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. రూ.2000 కంటే ఎక్కువ విలువైన టికెట్లను యూపీఐ ద్వారా బుక్ చేసుకునే సమయంలో చెల్లింపుల ప్రక్రియలో కీలక మార్పులు రానున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

దేశవ్యాప్తంగా తగ్గిన ఇళ్ల విక్రయాలు

దేశంలోని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ విక్రయాల జోరు కాస్త మందగించింది. ఎన్‌ఎస్‌ఈ నమోదిత రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'ప్రాప్‌ఈక్విటీ' నివేదిక ప్రకారం.. 2026 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో (క్యూ3) తొమ్మిది కీలక నగరాల్లో కేవలం 1,03,170 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో నమోదైన 1,09,420 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు 6 శాతం మేర తగ్గాయి. అంతకుముందు త్రైమాసికంతో పోల్చినా విక్రయాల్లో 4 శాతం క్షీణత కనిపించింది.
🏠 Home