అక్టోబర్ 2న ‘నో యూపీఐ డే’.. ఎండీఆర్ ఛార్జీలపై రిటైలర్ల సమరం!
ముఖ్యమైన పాయింట్స్:క్యూఆర్ కోడ్‌లపై నల్లగుడ్డ కప్పి నిరసన.. క్యాష్, కార్డుల ద్వారానే పేమెంట్లు
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (MDR) ఛార్జీల విధింపును నిరసిస్తూ దేశవ్యాప్తంగా మొబైల్ రిటైలర్లు ఆందోళనకు సిద్ధమయ్యారు. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న ‘నో యూపీఐ డే’ నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (ఏఐఎంఆర్‌ఏ - AIMRA) ప్రకటించింది. రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీలు విధించాలన్న ప్రతిపాదన చిన్న, మధ్య తరహా వ్యాపారుల నడ్డి విరుస్తుందని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
నిరసనలో భాగంగా అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా వేలాది మొబైల్ షాపుల్లోని క్యూఆర్ కోడ్ స్టాండ్లను నల్లటి గుడ్డతో కప్పివేయనున్నారు. ఆ రోజు వినియోగదారుల నుంచి ఎలాంటి యూపీఐ స్కాన్‌లు స్వీకరించరు. కేవలం నగదు (క్యాష్), డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా మాత్రమే చెల్లింపులు తీసుకోవాలని ఏఐఎంఆర్‌ఏ నిర్ణయించింది. డిజిటల్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా.. ప్రస్తుతం ఉన్న ‘జీరో-ఎండీఆర్’ విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు అసోసియేషన్ ఇప్పటికే లేఖ రాసింది.
ఏటా రూ.500 కోట్ల అదనపు భారం..
మొబైల్ రిటైల్ రంగంలో లాభాల మార్జిన్ అత్యల్పంగా ఉంటుందని, ఈ పరిస్థితుల్లో అదనపు ఛార్జీలు తమ ఆదాయానికి గండికొడతాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఏఐఎంఆర్‌ఏ వైస్ ప్రెసిడెంట్ తర్వీంద్ సింగ్ మాట్లాడుతూ.. నెలకు రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు యూపీఐ లావాదేవీలు చేసే చిన్న వ్యాపారులపై 0.4 శాతం ఛార్జీ తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. దీనివల్ల నెలకు రూ.2,000 నుంచి రూ.12,000 వరకు ప్రతి వ్యాపారి ఆదాయం కోల్పోతాడని తెలిపారు. దేశవ్యాప్తంగా లెక్కవేస్తే రిటైలర్లపై నెలకు రూ.40 కోట్లు, ఏడాదికి సుమారు రూ.500 కోట్ల మేర అదనపు భారం పడుతుందని అసోసియేషన్ అంచనా వేసింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో తమ లాభాలపై దెబ్బకొట్టొద్దని, తక్షణమే ఎండీఆర్ ఛార్జీల ప్రతిపాదనను విరమించుకోవాలని మొబైల్ రిటైలర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.