పునాది గుంతలో మృత్యుఘోష
ముఖ్యమైన పాయింట్స్:నిర్మాణ స్థలంలో కుప్పకూలిన జేసీబీ, క్రేన్- సైట్ ఇంజనీర్ సహా ముగ్గురి దుర్మరణం- మరో ముగ్గురికి తీవ్ర గాయాలు- తిరుపతి 'నంది గ్రూప్ ఆఫ్ హోటల్స్' సైట్‌లో ఘోర ప్రమాదం- ఘటనా స్థలాన్ని పరిశీలించిన కమిషనర్ జయకృష్ణ
తిరుపతి: నగరంలో నిర్మాణంలో ఉన్న ఓ భవన స్థలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పునాదుల కోసం తీసిన భారీ గుంతలోకి అకస్మాత్తుగా జేసీబీ, క్రేన్ విరిగిపడటంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీ కన్వెన్షన్ పక్కనే ఉన్న స్థలంలో 'నంది గ్రూప్ ఆఫ్ హోటల్స్' ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణం జరుగుతోంది. ఇందులో భాగంగా సుమారు 30 అడుగుల లోతులో పునాదులు తీసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈ క్రమంలో మట్టి తోలుతున్న జేసీబీ, క్రేన్ అదుపుతప్పి కింద పనిచేస్తున్న కార్మికులపై ఒక్కసారిగా కుప్పకూలాయి. భారీ యంత్రాలు మీద పడటంతో శ్రీకాకుళానికి చెందిన సైట్ ఇంజనీర్ సందీప్, తిరుపతికి చెందిన సెక్యూరిటీ గార్డు గంగయ్య (45), ఒడిశాకు చెందిన వలస కూలీ రామారావు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కిందే పనిచేస్తున్న బీహార్‌కు చెందిన షేక్ ఫర్హాన్, నౌషాన్, మల్లవరానికి చెందిన మురుగయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి మెరుగైన వైద్యం అందుతోంది.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జయకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. భద్రతా ప్రమాణాల ఉల్లంఘన వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తెలంగాణలో ఘోర అగ్నిప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆస్తులు
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మరో ఘోర అగ్నిప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటల్లో కష్టపడి దాచుకున్న రూ.20 లక్షల నగదుతో పాటు 4 తులాల బంగారు ఆభరణాలు కాలి బూడిదయ్యాయి. క్షణాల వ్యవధిలోనే సర్వస్వం కోల్పోవడంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.