చైనా 'PL-15E' క్షిపణి రహస్యాలపై భారత్ రివర్స్ ఇంజనీరింగ్.. డేటా కోసం ఫ్రాన్స్, జపాన్ ఆసక్తి!
న్యూఢిల్లీ/హోషియార్‌పూర్: ఆపరేషన్ సిందూర్ సమయంలో పంజాబ్‌లోని హోషియార్‌పూర్ సమీపంలో కూలిపోయిన చైనా తయారీ 'PL-15E' సుదూర శ్రేణి ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి సాంకేతికతపై భారత రక్షణ రంగ నిపుణులు కీలక పరిశోధనలు జరుపుతున్నారు. ఈ క్షిపణి పనితీరు, దానిలో వాడిన ఆధునిక పరిజ్ఞానాన్ని ఛేదించేందుకు భారత్ శరవేగంగా 'రివర్స్ ఇంజనీరింగ్' చేస్తోంది. కాగా, భారత్ వద్ద ఉన్న ఈ చైనీస్ మిస్సైల్ రహస్యాలు, సాంకేతిక సమాచారం తెలుసుకునేందుకు జపాన్‌తో పాటు ఫ్రాన్స్ కూడా తీవ్ర ఆసక్తి కనబరుస్తుండటం అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది (PL-15E Missile Reverse Engineering).
PL-15E క్షిపణిలోని సీకర్ (Seeker), గైడెన్స్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్లు, కమ్యూనికేషన్ సిస్టమ్‌పై భారత శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. చైనీస్ క్షిపణి శత్రు విమానాలను ఎలా ట్రాక్ చేస్తుంది? దాని సిగ్నల్స్‌ను ఎలా నిరోధించవచ్చు (Jamming) అనే అంశాలపై పరిశోధనలు సాగుతున్నాయి. ఈ విశ్లేషణ ద్వారా లభించే కీలక డేటాను భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న Astra Mk-2 Missile ప్రాజెక్ట్‌లో ఉపయోగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ తన జే-10సీ (J-10C), జేఎఫ్-17 (JF-17) యుద్ధ విమానాల్లో ఈ పీఎల్-15 క్షిపణులను అనుసంధానించగా, భారత్ వద్ద రాఫెల్, సుఖోయ్-30MKI, తేజస్ వంటి శక్తివంతమైన ఫైటర్ జెట్లు ఉన్నాయి.
రాఫెల్ అప్‌గ్రేడ్ కోసం ఫ్రాన్స్ కన్ను:
ఆపరేషన్ సిందూర్‌లో భారత వైమానిక దళం ప్రదర్శించిన వ్యూహాత్మక పటిమను అధ్యయనం చేస్తున్నట్లు ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ డొమినిక్ టార్డిఫ్ వెల్లడించారు (French Air Force Studies). రాఫెల్ యుద్ధవిమానాల కోసం అత్యాధునిక లాంగ్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైళ్లను అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్న ఫ్రాన్స్, భారత్‌కు చిక్కిన ఈ చైనా క్షిపణి సమాచారంపై ప్రత్యేక దృష్టి సారించింది. మొత్తానికి చైనా వైమానిక ఆయుధాల నిజమైన సామర్థ్యాన్ని, లోపాలను అధ్యయనం చేయడానికి భారత్‌కు ఒక అరుదైన సాంకేతిక అవకాశం లభించినట్లయింది.