జలమండలికి భారీగా నిధులు: రూ.687.50 కోట్లకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు
ముఖ్యమైన పాయింట్స్:20 కేఎల్ ఉచిత నీటి పథకానికి రూ.75 కోట్లు.. సుంకిశాల ప్రాజెక్టుకు మరో రూ.250 కోట్ల విడుదల
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాగునీటి సరఫరా, మౌలిక వసతుల అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) చేపట్టే వివిధ అభివృద్ధి పనులతో పాటు ఉచిత నీటి పథకానికి నిధులు కేటాయిస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో అమలు చేస్తున్న 20 కిలోలీటర్ల ఉచిత నీటి సరఫరా పథకానికి (Free Water Scheme) సంబంధించి జలమండలికి ప్రభుత్వం రూ.75 కోట్ల పరిపాలనా అనుమతి ఇచ్చింది. 2026-27 బడ్జెట్‌లో ఈ పథకం కోసం రూ.300 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.75 కోట్లు విడుదల చేశారు. తాజాగా మరో రూ.75 కోట్లకు అనుమతి ఇవ్వడంతో ఇప్పటివరకు మొత్తం రూ.150 కోట్లకు ఆమోదం తెలిపినట్లయింది. మిగిలిన రూ.150 కోట్లను తదుపరి విడతల్లో విడుదల చేయనున్నారు.
అభివృద్ధి పనులకు రుణంగా రూ.362.50 కోట్లు:
నగరంలో జలమండలి చేపడుతున్న వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల కోసం రుణాల రూపంలో రూ.362.50 కోట్లకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 2026-27 బడ్జెట్ కేటాయింపుల్లోని రూ.1,450 కోట్లలో గతంలో రూ.362.50 కోట్లు ఇవ్వగా, ఇప్పుడు మరో రూ.362.50 కోట్లు కేటాయించారు. ఇంకా బకాయి ఉన్న రూ.725 కోట్లు రాబోయే రోజుల్లో విడుదల కానున్నాయి.
సుంకిశాల ప్రాజెక్టుకు రూ.250 కోట్లు:
కృష్ణా తాగునీటి సరఫరా పథకంలో భాగమైన సుంకిశాల ఇన్‌టేక్ ప్రాజెక్టు (Sunkishala Intake Project) కోసం జలమండలికి రుణంగా రూ.250 కోట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2026-27 బడ్జెట్‌లో కేటాయించిన రూ.1,000 కోట్లలో ఇంతకుముందే రూ.250 కోట్లు విడుదల చేయగా, తాజాగా మరోసారి రూ.250 కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చారు. మిగిలిన రూ.500 కోట్లు త్వరలోనే ప్రభుత్వం మంజూరు చేయనుంది.