🏠 mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 07 October 2026, 9:27 pm Posted by : M TODAY NEWS

ఏపీలో స్థానిక పోరుకు వేళాయే!

News Image
ముఖ్యమైన పాయింట్స్:రేపే ఎస్‌ఈసీ కీలక భేటీ.. షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) వేగంగా అడుగులు వేస్తోంది. క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్న తుది ఏర్పాట్లను సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ గురువారం విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో అత్యున్నత స్థాయి భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో పాటు జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొననున్నారు. రాబోయే Local Body Elections నిర్వహణపై ఈ భేటీలో తుది సమీక్ష నిర్వహించనున్నారు.

క్యాబినెట్ భేటీతో వాయిదా.. క్లారిటీతో రంగంలోకి!

వాస్తవానికి ఈ సమావేశం బుధవారమే జరగాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కారణంగా గురువారానికి వాయిదా పడింది. స్థానిక పోరుకు సంబంధించి ప్రభుత్వ తుది అభిప్రాయాలు, భద్రతాపరమైన అంశాలపై క్యాబినెట్ భేటీలో స్పష్టత రావడంతోనే గురువారం నాటి సమావేశాన్ని ఎస్‌ఈసీ అత్యంత ప్రాధాన్యతతో తీర్చిదిద్దింది.

గురువారం జరిగే అధికారుల సమీక్ష ముగిసిన వెంటనే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల Election Schedule ను ఎస్‌ఈసీ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ పూర్తయినందున, వెనువెంటనే Election Notification జారీ చేసి పోలింగ్ నిర్వహణకు శ్రీకారం చుట్టాలని కమిషన్ సన్నాహాలు చేస్తోంది.
🏠 Home