🏠 mtodaynews.in
Watermark
Newspaper Logo
Date of Publish : 09 October 2026, 11:01 pm Posted by : M TODAY NEWS

ఆస్తి వివాదం నడుమ ‘అగ్గిపెట్ట మచ్చ’ అంత్యక్రియలు పూర్తి

News Image
ముఖ్యమైన పాయింట్స్:రెండు రోజుల చర్చల అనంతరం తుది శ్వాస విడిచిన సోషల్ మీడియా స్టార్
తమదైన శైలితో సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన 'అగ్గిపెట్ట మచ్చ' తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను సోదరి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో బుధవారం సాయంత్రం ఆయన మృతి చెందారు. Aggipetta Macha Demise వార్త విన్న ఆయన స్నేహితులు, అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

అగ్గిపెట్ట మచ్చకు ప్రత్యక్ష వారసులు ఎవరూ లేకపోవడంతో అంత్యక్రియల నిర్వహణపై కుటుంబంలో తీవ్ర వివాదం చెలరేగింది. హిందూ సంప్రదాయం ప్రకారం తలకొరివి పెట్టాలని ఆయన సోదరి బాబాయి, పెద్దనాన్న పిల్లలను కోరారు. అయితే, ఆయన పేరిట ఉన్న ఇంటిని తమ పేరిట రాసిస్తేనే తలకొరివి పెడతామని బంధువులు షరతు విధించారు. ఈ Property Dispute కారణంగా గురువారం జరగాల్సిన అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. సోదరుడికి తలకొరివి పెట్టడానికి కూడా ఆస్తి అడుగుతున్నారంటూ సోదరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావడంతో స్నేహితులు, సోషల్ మీడియా సన్నిహితులు రంగంలోకి దిగారు. రెండు రోజుల పాటు ఫ్యామిలీ మెంబర్స్‌తో జరిపిన చర్చలు సఫలం కావడంతో వివాదం సమసిపోయింది. ప్రముఖ Youtuber Satyaతో పాటు పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ చర్చలలో పాల్గొని సమస్యను పరిష్కరించారు. అనంతరం శుక్రవారం సాయంత్రం అగ్గిపెట్ట మచ్చ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి.
🏠 Home