*బుల్లెట్ ట్రైన్ దీక్షలో కూర్చున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్యవైశ్య మిత్రుల సంఘీభావం*
సూర్యాపేట: గత 33 రోజులుగా సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ నడపాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా బుధవారం ఈ రిలే నిరాహార దీక్షలో రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొనగా సూర్యాపేటకు చెందిన ఆర్యవైశ్య మిత్రులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మిత్రులు తప్సీ గాంధీ,కలకోట లక్ష్మయ్య, చల్లా సత్యనారాయణ, శ్రీ వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా, చిరకాల కోరికగా సూర్యాపేటకు రైలు మార్గం పునరుద్దించాలనీ కోరుతూ ఆర్యవైశ్య ప్రముఖులు మంచాల రంగయ్య నేతృత్వంలో ఎంతోమంది నాయకులకు విన్నవించుకున్న కొందరి స్వార్థపూరిత ప్రయోజనాలతో రైలు మార్గం సూర్యాపేట మీదుగా పునర్దించకుండా...