త్యాగధనుల స్ఫూర్తితో ప్రజా పాలనను మరింత బలోపేతం చేద్దాం

ముఖ్యమైన పాయింట్స్:తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా డీసీసీ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ సూర్యాపేట : సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించగా ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాలు, అనేక పోరాటాల స్ఫూర్తితో రాచరిక పాలన నుంచి విముక్తి పొంది భారత యూనియన్‌లో విలీనమైన తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ఆ చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ...