ముల్తానీ కమ్యూనిటీ సమస్యల అధ్యయనానికి ప్రత్యేక కమిటీ

ముఖ్యమైన పాయింట్స్:- జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు- ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో నివసిస్తున్న ముల్తానీ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, ఉపాధి సమస్యలను పరిష్కరించే దిశగా జిల్లా యంత్రాంగం కీలక అడుగు వేసింది. వారి పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, తగిన పరిష్కార మార్గాలు చూపేందుకు ముగ్గురు అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్ కౌన్సిలర్ ప్రతినిధి ఎస్.ఎస్. రషీద్ ఉల్ హక్, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు సద్దాం తదితరులు ఇటీవల కలెక్టర్‌ను...