శ్రీవారి సేవకుల పేరుతో శాశ్వత ఉద్యోగాలకు ఎసరు పెట్టొద్దు

ముఖ్యమైన పాయింట్స్:• టీటీడీ సిబ్బందిపై సీఎం వ్యాఖ్యలు అభ్యంతరకరం: మురళి• 50 శాతం బడ్జెట్ జీతాలకేననడం అవాస్తవం తిరుమలలో భక్తులకు నిరంతరం సేవలందిస్తున్న టీటీడీ శాశ్వత ఉద్యోగులను తగ్గించి, ఆ పనులను శ్రీవారి సేవకులతో చేయించుకోవాలని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని మురళి పేర్కొన్నారు. టీటీడీ ఉద్యోగులను తక్కువ చేసి మాట్లాడటం వారి మనోభావాలను గాయపరచడమేనని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా అందిస్తున్న సేవలను తాము పూర్తిగా గౌరవిస్తామని, అయితే వారిని శాశ్వత ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా చూపడం ఏమాత్రం సరికాదని మురళి హితవు పలికారు. పారిశుద్ధ్యంతో సహా తిరుమలలో ప్రతిరోజూ నిర్వహించాల్సిన...