బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు శుభవార్త.. 20న విజయవాడ-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు, గరుడ సేవ నేపథ్యంలో తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం సెప్టెంబర్ 20వ తేదీన విజయవాడ - తిరుపతి మధ్య ఒక ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రైళ్ల రాకపోకల సమయాలను పరిశీలిస్తే.. తిరుపతి - విజయవాడ ప్రత్యేక రైలు (నెంబర్ 07606) సెప్టెంబర్ 20న తెల్లవారుజామున 1:15 గంటలకు తిరుపతిలో బయలుదేరి, అదే రోజు ఉదయం 8:00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ - తిరుపతి ప్రత్యేక రైలు (నెంబర్ 07605) అదే రోజు ఉదయం 9:00 గంటలకు విజయవాడలో బయలుదేరి, సాయంత్రం...