విమానయాన వ్యయంపై భగ్గుమన్న రాజకీయం
ముఖ్యమైన పాయింట్స్:పవన్, లోకేష్‌ల పర్యటనలకు ఏపీఏసీఎల్ నిధులు వాడట్లేదన్న ప్రభుత్వంఏపీఏసీఎల్ బడ్జెట్ మొత్తం సీఎం పర్యటనలకేనని ప్రచారం చేయడం తగదని వివరణగత ఐదేళ్లలో రూ.222 కోట్లు ఖర్చయ్యాయంటూ వైసీపీకి కూటమి నేతల కౌంటర్‌లెక్కలు పారదర్శకంగా ఉంటేనే వివాదానికి ముగింపు అంటున్న విశ్లేషకులు అమరావతి - ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో విమానయాన ఖర్చుల వ్యవహారం మరోసారి రాజకీయ దుమారానికి దారితీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల అధికారిక పర్యటనలకు ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారంటూ ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. ఏపీఏసీఎల్ (APACL)కు కేటాయించిన బడ్జెట్‌ను మొత్తం ముఖ్యమంత్రి...