21, 22 తేదీల్లో కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
ముఖ్యమైన పాయింట్స్:హంద్రీ-నీవా కాలువ వద్ద జలహారతిరైతు బజార్‌కు శంకుస్థాపన, పలు ప్రాజెక్టుల ప్రారంభంకుప్పంలో దాదర్ - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్ సిగ్నల్ కుప్పం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 21, 22 తేదీల్లో తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సెప్టెంబర్ 21న బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి శాంతిపురం మండలం తుమ్సి గ్రామానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి గుండిశెట్టిపల్లి వద్ద ఉన్న హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీ-నీవా) కాలువ వద్దకు వెళ్లి జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగానిపల్లిలో నూతన...