బడి తెరిచే నాటికే యూనిఫాం, పుస్తకాలు!
ముఖ్యమైన పాయింట్స్:వచ్చే ఏడాది కోసం ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలిఅదనంగా 10 శాతం విద్యార్థుల చేరికను దృష్టిలో ఉంచుకోవాలివిద్యాశాఖ అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్షనెలాఖరుకల్లా రెండో జత యూనిఫాం పంపిణీ హైదరాబాద్:రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరం పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాం, నోటు పుస్తకాలు, ఇతర సామగ్రి అందేలా ఇప్పటినుంచే పక్కా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న యూనిఫాం, ఇతర వస్తువుల పంపిణీపై సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా మరో 10 శాతం విద్యార్థులు చేరే అవకాశం ఉన్నందున, ఆ పెరిగే సంఖ్యకు అనుగుణంగా...