రుషికొండ ప్యాలెస్ ఓ 'తెల్ల ఏనుగు'.. విశాఖ ప్రగతి అన్స్టాపబుల్
ముఖ్యమైన పాయింట్స్:భవనాల వినియోగంపై త్వరలోనే నిర్ణయంరానున్న రోజుల్లో విశ్వనగరంగా విశాఖపట్నంఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కట్టుబడి ఉన్నాంవిశాఖ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృథా చేస్తూ రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్ నిర్వహణ.. ఓ 'తెల్ల ఏనుగు'ను మేపినట్లేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటని, రానున్న రోజుల్లో ఇది విశ్వనగరంగా మారుతుందని ఆయన ఆకాంక్షించారు. విశాఖపట్నంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాజుల కాలం నాటి పద్ధతిలో గత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రుషికొండపై విలాసవంతమైన భవనాలు నిర్మించారని, వాటిని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం...