గణేష్ నిమజ్జనంలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో యువకుడి మృతి
ముఖ్యమైన పాయింట్స్:డ్యాన్స్ చేసి ఇంటి మెట్లపై కూర్చుండగానే ప్రాణాలు వదిలిన వైనంకన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులుగతేడాది వివాహ వేడుకలో గుండెపోటుతోనే అన్న మృతినల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్)లో ఘటన నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఓ యువకుడు గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. కళ్లముందే భర్త ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన సింగారపు బాలయ్య అలియాస్ రాము (34) తమ వీధిలో ఏర్పాటు చేసిన గణేశుని నిమజ్జన ఊరేగింపులో స్నేహితులతో కలిసి పాల్గొన్నాడు. విగ్రహం ముందు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ అలసిపోయాడు....