చెల్లెలి హత్యకు ప్రతీకారం.. పక్కా స్కెచ్‌తోనే హరిబాబు దారుణ హత్య
ముఖ్యమైన పాయింట్స్:నిజామాబాద్‌లో సంచలనం సృష్టించిన కేసు ఛేదనసోదరి వైష్ణవి మృతికి బదులు తీర్చుకునేందుకే దారుణంవిశాఖకు పారిపోతుండగా ప్రధాన నిందితుడు సంతోష్ అరెస్ట్కారు, మూడు కత్తులు స్వాధీనం.. వివరాలు వెల్లడించిన సీపీ సాయి చైతన్య నిజామాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన హరిబాబు హత్య కేసును పోలీసులు కేవలం 36 గంటల్లోనే ఛేదించారు. సోదరి వైష్ణవి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకే ముందస్తు ప్రణాళికతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి, అతడి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, మరో రెండు కత్తులు, రెండు కర్రలతో పాటు ఓ తెలుపు రంగు స్విఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్...