జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్: ఆ ప్లాన్లపై ఏడాది పాటు 'అమెజాన్ ప్రైమ్' ఉచితం

న్యూస్‌డెస్క్: రిలయన్స్ జియో తమ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జియోహోమ్ (JioHome) కస్టమర్లకు భారీ ఆఫర్‌ను ప్రకటించింది. బ్రాడ్‌బ్యాండ్, టీవీ, ఓటీటీ సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చే ఎంపిక చేసిన '3-ఇన్-1 జియోహోమ్' ప్లాన్లపై ఏడాది పాటు 'అమెజాన్ ప్రైమ్ లైట్' (Amazon Prime Lite) సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. పాత, కొత్త కస్టమర్లందరికీ ఎటువంటి అదనపు రుసుము లేకుండా ఈ ప్రయోజనం చేకూరనుంది. ఆఫర్ వర్తించే ప్లాన్లు ఇవే.. 30 ఎంబీపీఎస్ (Mbps), 100 ఎంబీపీఎస్ స్పీడ్ కలిగిన 3-ఇన్-1 జియోహోమ్ ప్లాన్లను వినియోగిస్తున్న కస్టమర్లకు ఈ కొత్త ఆఫర్ వర్తిస్తుంది. మరోవైపు, ఇప్పటికే ఉన్న హై-ఎండ్ ప్లాన్ల (రూ.888,...