జగన్ గూటికి మళ్లీ షర్మిల?.. తెరవెనుక రాజీ ప్రయత్నాలు!
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకునే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం పాలవ్వగా, ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల సైతం ఆ పార్టీని గెలిపించుకోలేకపోయారు. అయితే, జగన్ ఓటమిలో షర్మిల పాత్ర ఉందన్నది రాజకీయ వర్గాల్లో బహిరంగ రహస్యమే. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న ఈ పోరులో అన్నాచెల్లెళ్లు ఇద్దరూ నష్టపోయారని, అంతిమంగా వారి ఉమ్మడి ప్రత్యర్థి లాభపడ్డారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వాస్తవాన్ని ఆలస్యంగా గ్రహించిన వైఎస్ కుటుంబం, ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. జగన్, షర్మిల మధ్య సయోధ్య కుదిర్చేందుకు వారి తల్లి వైఎస్ విజయమ్మతో...