డీజేలకు 'నో'.. ఉండిలో రఘురామ సంచలన నిర్ణయం
ముఖ్యమైన పాయింట్స్:నిర్వాహకులకు పత్రికా కథనంతో అవగాహన.. రాష్ట్రవ్యాప్తంగా మన్ననలు రాజకీయాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా అందులో తనదైన మార్క్ చూపించే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు మరోసారి వార్తల్లో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనాల్లో డీజేల మోత మోగుతున్న వేళ, తన నియోజకవర్గంలో మాత్రం వాటిని నిషేధిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. డీజేల శబ్ద కాలుష్యంతో ప్రాణాలు పోతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు కీలక అడుగు వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో గణేశ్ నిమజ్జనాల సందర్భంగా డీజేల అనుమతి కోసం స్థానిక ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యే రఘురామను కలిశారు. అయితే వారికి అనుమతి ఇచ్చేందుకు నిరాకరించిన...