రష్యా ఎన్నికల్లో మళ్లీ పుతిన్ హవా

ముఖ్యమైన పాయింట్స్:ఉక్రెయిన్ దాడుల మధ్యే పోలింగ్.. అధికార పార్టీకి భారీ ఆధిక్యం‘యునైటెడ్ రష్యా’కు 57.5% ఓట్లు.. వెనుకబడిన ప్రతిపక్షాలుమాస్కోపై డ్రోన్ దాడులు.. ఐదుగురు మృతి ఉక్రెయిన్‌తో యుద్ధం ఐదో ఏడాదిలోకి ప్రవేశించిన వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన రాజకీయ పట్టును మరోసారి నిరూపించుకున్నారు. యుద్ధంపై ప్రజల మద్దతును పరీక్షించుకునేందుకు జరిగిన పార్లమెంటు (స్టేట్ డూమా) ఎన్నికల్లో ఆయనకు చెందిన అధికార ‘యునైటెడ్ రష్యా’ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ప్రతిపక్షాలు చాలా వెనుకబడిపోవడంతో రష్యా రాజకీయాలపై పుతిన్ ఆధిపత్యం కొనసాగుతోందని తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 7.7 శాతం పెరిగిన ఓటు బ్యాంకు సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు మూడు...