గూండాయిజం చేస్తే ఉపేక్షించేది లేదు: సీఎం చంద్రబాబు
ముఖ్యమైన పాయింట్స్:స్పోర్ట్స్ కోటా టీచర్లపై దాడి ఘటనపై ముఖ్యమంత్రి సీరియస్నారావారిపల్లె జన్మనిస్తే.. కుప్పం నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిందిడీఎస్సీ అంటేనే టీడీపీ.. అడ్డంకులు దాటి 16వేల పోస్టుల భర్తీ'స్వర్ణ కుప్పం' బహిరంగ సభలో సీఎం ఉద్వేగభరిత ప్రసంగం కుప్పం: గురువులపై దాడులకు తెగబడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని, గూండాయిజం చేసే వారి తోకలు కత్తిరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన 'స్వర్ణ కుప్పం' బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవల విజయవాడలో స్పోర్ట్స్ కోటా టీచర్లపై...