ప్రజాశీర్వాదం ఉంటే భవిష్యత్తులో రాష్ట్రాన్ని నడిపిస్తా!
ముఖ్యమైన పాయింట్స్:నాడు చంద్రబాబు, రేవంత్‌తో కలిసి ప్రచారం చేశా.. నేడు వారిద్దరూ సీఎంలుతెలంగాణలోనూ మాతృస్వామ్య పాలన రావాలిబీఆర్ఎస్ నేత కవిత ఆసక్తికర వ్యాఖ్యలు హైదరాబాద్: గతంలో ఒకే వేదికపై నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో కలిసి తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని.. ఆనాడు తనతో పాటు వేదిక పంచుకున్న ఆ ఇద్దరు నేతలు నేడు రెండు తెలుగు రాష్ట్రాలకు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని బీఆర్ఎస్ నేత కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదొక విచిత్రమైన సెంటిమెంట్ అని ఆమె అభివర్ణించారు. భవిష్యత్తులో ప్రజల ఆశీర్వాదం ఉంటే తాను కూడా రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించగలననే సంపూర్ణ విశ్వాసం తనకుందని ఆమె ధీమా వ్యక్తం...