ఇరాన్‌పై అమెరికా దాడులు? 12 మంది మృతి!
ముఖ్యమైన పాయింట్స్:760 నౌకలు ధ్వంసమయ్యాయన్న ఇరాన్ న్యాయవ్యవస్థతమ పౌరులకు అమెరికా అత్యవసర హెచ్చరికలు.. తక్షణమే దేశం విడిచి రావాలని ఆదేశంపశ్చిమాసియాలో మరోసారి తారస్థాయికి ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా జరిపిన క్షిపణి దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని ఇరాన్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో నౌకలు ధ్వంసమైనట్లు వెల్లడించింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన: అలీ కజెమీ అమెరికా దాడులపై ఇరాన్ న్యాయవ్యవస్థ ప్రతినిధి అలీ కజెమీ అధికారిక ప్రకటన విడుదల చేశారు....