రాయచోటి పట్టణ సమగ్రాభివృద్ధికి రూ.244.32 కోట్లు

రాయచోటి: రాయచోటి పట్టణ రూపురేఖలు త్వరలో పూర్తిగా మారనున్నాయి. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలన్న రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ భారీగా నిధులు మంజూరు చేసింది. వివిధ పథకాల కింద ఏకంగా రూ.244.32 కోట్ల నిధులను కేటాయించినట్లు మంత్రి మండిపల్లి సోమవారం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. సురక్షితమైన తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, వ్యర్థాల నిర్వహణ, నాణ్యమైన రహదారులు, పార్కులు, వీధి దీపాల కల్పనకు ఈ నిధులను వెచ్చించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పట్టణంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. అమృత్...