విజయసాయి ‘వాయిస్’పై వైసీపీ విషప్రచారం.. సొంత నేత పత్రికపై ఎందుకంత భయం?

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వ్యవహారశైలి ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సజ్జల తనపై దాడులకు సైతం దిగారని విజయసాయిరెడ్డి బహిరంగంగా ఆరోపించడం కలకలం రేపింది. అక్కడితో ఆగకుండా తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్న ఆరోపణలు వైసీపీ నాయకత్వానికి ఏమాత్రం మింగుడుపడటం లేదు. గతంలోనే తాను సొంతంగా ఒక మీడియా సంస్థను స్థాపిస్తానని, ఆ వ్యవహారాలను తన కుమార్తె చూసుకుంటారని విజయసాయిరెడ్డి...