కూతురి పెళ్లిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాల్సిన ఖర్మ నాకు లేదు!

ముఖ్యమైన పాయింట్స్:పార్టీ మారుతున్నాననేది శుద్ధ అబద్ధం.. దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన వైఎస్ షర్మిల తాను పార్టీ మారుతున్నట్లు, ఎవరితోనో తెరవెనుక మంతనాలు సాగిస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ కేవలం కట్టుకథలేనని, ఆ విశ్లేషణలన్నీ పూర్తిగా నిరాధారమైనవని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. గిట్టనివారు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఈ పసలేని ఆరోపణలను, అబద్ధాలను ఆమె తీవ్రంగా ఖండించారు. తన కుమార్తె పెళ్లి పిలుపును రాజకీయాలతో ముడిపెట్టడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. తన సోదరుడు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గతంలో తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించేందుకే చివరిసారిగా కలిశానని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు తన కుమార్తె వైఎస్...