దసరా కానుకగా కొత్త పెన్షన్లు!

ముఖ్యమైన పాయింట్స్:పండుగ ముందే లబ్ధిదారులకు అందించాలని సీఎం రేవంత్ ఆదేశం - వేగవంతమైన దరఖాస్తుల పరిశీలన - వితంతువులు, ఒంటరి మహిళలకే పెద్దపీట - సెర్ప్ సీఈవోకు బాధ్యతలు అప్పగించిన మంత్రి సీతక్క రాష్ట్రంలోని పేదలకు దసరా పండుగకు ముందే కొత్త పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఈ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేశారు. రాబోయే అక్టోబర్ నెల నుంచి అర్హులైన కొత్త లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ అధికారికంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవహారంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి సారించారు. దసరా నాటికి లబ్ధిదారులకు పెన్షన్లు అందేలా పకడ్బందీ ఏర్పాట్లు...