జపాన్ స్పిన్నర్ల ఉచ్చులో టీమిండియా!

ముఖ్యమైన పాయింట్స్:సింగిల్ డిజిట్‌కే పరిమితమైన స్టార్లు.. అసోసియేట్ దేశంపై చెత్త రికార్డు నమోదు జపాన్ తో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆతిథ్య జట్టు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా తడబడ్డారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కేవలం 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ అభిషేక్‌ శర్మ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుతిరగ్గా.. సంజూ శాంసన్‌ (9), ఇషాన్‌ కిషన్‌ (3), తిలక్‌ వర్మ (1) వంటి స్టార్ ప్లేయర్లు సైతం సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పెవిలియన్ చేరారు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 12 బంతుల్లో 16 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవడం గమనార్హం....