తోటి విద్యార్థుల ఎగతాళి.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం!
ముఖ్యమైన పాయింట్స్:బుధరావుపేట మోడల్ స్కూల్ హాస్టల్లో ఘటన - ఆస్పత్రిలో చికిత్స, పరిస్థితి నిలకడ - పర్యవేక్షణపై వెల్లువెత్తుతున్న విమర్శలు నర్సంపేట : తోటి విద్యార్థులు ఎగతాళి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని హాస్టల్లోనే టాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నర్సంపేట మండలంలో కలకలం రేపింది. బుధరావుపేట మోడల్ స్కూల్ హాస్టల్లో చోటుచేసుకున్న ఈ ఘటన సిబ్బంది పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపుతోంది. నర్సంపేట పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని బుధరావుపేట మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటోంది. శనివారం ఆమె అనారోగ్యానికి గురికావడంతో హాస్టల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు....