టాలీవుడ్‌కు గుడ్‌న్యూస్.. మళ్లీ మొదలుకానున్న 'నంది' సందడి!
ముఖ్యమైన పాయింట్స్:2012 నుంచి పెండింగ్‌లో ఉన్న అవార్డుల ప్రదానానికి సర్కార్ సన్నాహాలు - అమరావతిలో చలనచిత్ర, తిరుపతిలో టీవీ పురస్కారాల వేడుక - నవంబర్లోనే జ్యూరీల ఎంపిక, విజేతల ప్రకటన తెలుగు సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'నంది' అవార్డుల ప్రదానోత్సవానికి మళ్లీ కదలిక వచ్చింది. ఏళ్లుగా నిలిచిపోయిన ఈ పురస్కారాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2012 నుంచి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న అవార్డులతో పాటు, 2025 సంవత్సరానికి సంబంధించిన అవార్డుల ప్రక్రియను కూడా ఏకకాలంలో నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఉత్తమ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు ఇచ్చే ఈ పురస్కారాలు కొంతకాలంగా నిలిచిపోవడంతో సినీ వర్గాల్లో తీవ్ర...