అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదులపై దౌర్జన్యం.. తీవ్రంగా స్పందించిన హైకోర్టు

ముఖ్యమైన పాయింట్స్:• సీసీటీవీ ఫుటేజ్ సమర్పించాలని పోలీసులకు ఆదేశం...l• బాధిత న్యాయవాదులకు అండగా బోథ్ బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ హైదరాబాద్ లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో ఉన్న న్యాయవాదుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేయగా, బాధిత న్యాయవాదులకు మద్దతుగా బోథ్ బార్ అసోసియేషన్ కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపింది. ఈ నెల 22న (మంగళవారం) న్యాయవాదులు షేక్ అఖీబ్, ఒక మహిళా న్యాయవాది తమ వృత్తిపరమైన పని నిమిత్తం అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అదే...