డ్రాగన్‌కు రెడ్‌కార్పెట్.. భారత్‌కు ఆంక్షల వార్నింగ్!
ముఖ్యమైన పాయింట్స్:జిన్‌పింగ్‌కు స్వయంగా స్వాగతం పలికిన ట్రంప్రష్యన్ క్రూడ్ కొనుగోళ్లపై భారత్‌కు టారిఫ్‌ల బెదిరింపుఅమెరికా దౌత్య వ్యూహాల్లో స్పష్టమైన ద్వంద్వ విధానం'చైనా ప్లస్ 1' వ్యూహంపై ప్రభావం పడే అవకాశం అమెరికా దౌత్య విధానాలు అంతర్జాతీయ వేదికపై తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ప్రధాన ప్రత్యర్థిగా భావించే చైనాకు ఒక న్యాయం, వ్యూహాత్మక మిత్రదేశమైన భారత్‌కు మరో న్యాయం అన్నట్లుగా అగ్రరాజ్యం వ్యవహరిస్తోంది. దాదాపు దశాబ్దం తర్వాత అమెరికా గడ్డపై అడుగుపెట్టిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద ప్రొటోకాల్ పక్కనపెట్టి మరీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. సైనిక గౌరవాలు అప్పగించారు. సరిగ్గా ఇదే సమయంలో, రష్యా...