'ది ప్యారడైజ్'లో పొలిటికల్ ట్విస్ట్.. కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లిన 'కేసీఆర్' పాత్ర!
ముఖ్యమైన పాయింట్స్:హీరో రేవంత్, విలన్ కేసీఆర్ అంటూ కాంగ్రెస్ శ్రేణుల ముందస్తు హంగామాతెరపై కేసీఆర్‌ను పాజిటివ్‌గా చూపించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలసవారీ తెగకు అండగా ఎమ్మెల్యే (ప్రియదర్శి) పాత్ర.. ఫుల్ జోష్‌లో బీఆర్ఎస్ హైదరాబాద్: నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన 'ది ప్యారడైజ్' చిత్రానికి తెలంగాణలో బలంగా రాజకీయ రంగు పులుముకుంది. సినిమా విడుదలకు ముందు సోషల్ మీడియాలో కాంగ్రెస్ శ్రేణులు చేసిన హడావుడి, తీరా సినిమా చూశాక అనూహ్యంగా తారుమారవడంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను అత్యంత సానుకూలంగా, స్ఫూర్తిదాయకంగా చూపించడం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ముందుగా...