విధి నిర్వహణలో విషాదం: హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఎస్సై మృతి
ముఖ్యమైన పాయింట్స్:ఎన్టీఆర్ మార్గ్‌లో గణేష్ నిమజ్జన బందోబస్తులో ఉండగా ఢీకొట్టిన స్కూటీచికిత్స పొందుతూ ఎంజీఎం ఆస్పత్రిలో కన్నుమూసిన కొత్తగూడెం టూ టౌన్ ఎస్సై వెంకన్ననిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న సీపీ సజ్జనార్ హైదరాబాద్: గణేష్ నిమజ్జన బందోబస్తు విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారి హిట్ అండ్ రన్ ప్రమాదానికి బలయ్యారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో విధులు నిర్వర్తిస్తున్న కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై కె. వెంకన్నను ఓ గుర్తుతెలియని స్కూటీ ఢీకొట్టి వెళ్లిపోవడంతో.. తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారి ప్రాణాలు కోల్పోవడం పోలీసు శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల వివరాల...