డేటా అక్కర్లేదా? అయితే తక్కువ ధరకే ప్లాన్లు!
ముఖ్యమైన పాయింట్స్:కేవలం వాయిస్, ఎస్ఎంఎస్లతో ప్రత్యేక ప్యాక్లుఅన్ని రకాల వ్యాలిడిటీల్లోనూ తీసుకురావాలని ట్రాయ్ ప్రతిపాదనడేటా లేనందుకు ధరలో గణనీయమైన కోతఫీచర్ ఫోన్ వాడే వృద్ధులు, గ్రామీణ ప్రజలకు ఊరట స్మార్ట్ఫోన్ల యుగంలోనూ ఇంటర్నెట్తో పనిలేకుండా కేవలం ఫోన్ కాల్స్, మెసేజ్‌లకే పరిమితమయ్యే కోట్లాది మంది మొబైల్ వినియోగదారులకు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) శుభవార్త తెలిపింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ) వంటి టెలికాం సంస్థలు డేటా లేకుండా కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ సేవలు అందించే ప్రత్యేక ప్లాన్లను అన్ని కాలపరిమితుల్లో (వ్యాలిడిటీ) అందుబాటులోకి తీసుకురావాలని తాజాగా ప్రతిపాదించింది. గత ఏడాది (2024) డిసెంబరులో తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం టెలికాం సంస్థలు...