తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

ముఖ్యమైన పాయింట్స్:ఈ ఏడాది 20 శాతం మేర పెరగనున్న భక్తుల రద్దీఅధికారుల సమీక్షలో టీటీడీ జేఈవో శరత్ వెల్లడిపంచమి తీర్థం రోజున 4 హోల్డింగ్ పాయింట్ల ఏర్పాటు తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించేందుకు టీటీడీ యంత్రాంగం సమాయత్తమవుతోంది. డిసెంబర్ 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలకు గత ఏడాదితో పోలిస్తే ఈసారి 15 నుంచి 20 శాతం వరకు భక్తులు అదనంగా వచ్చే అవకాశం ఉందని టీటీడీ జేఈవో శరత్ అంచనా వేశారు. రద్దీకి అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన అధికారులను...