జగన్‌తో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దశరథరామిరెడ్డి భేటీ: స్థానిక ఎన్నికల వేళ రాజకీయ ప్రాధాన్యం

తాడేపల్లి: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పాలచూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలూరు దశరథరామిరెడ్డి గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌మోహన్‌రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా తిరుపతి జిల్లాలోని నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో పార్టీ పరిస్థితి, ఎన్నికల సన్నద్ధతపై అధినేతతో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ఈ రెండు మండలాల్లో చురుకైన నాయకుడిగా ప్రజలకు సేవలందిస్తున్న దశరథరామిరెడ్డి.. రాబోయే స్థానిక పోరులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు,...