వైభవంగా శ్రీవారి దర్శనాలు.. రూ.29 కోట్లకు చేరిన హుండీ ఆదాయం

తిరుమల: తిరుమల గిరులకు విచ్చేసిన ప్రతి భక్తుడికీ మూలవిరాట్టు దర్శనంతో పాటు, వాహన సేవల్లో మలయప్ప స్వామి దర్శన భాగ్యం కల్పించినట్లు టీటీడీ చైర్మన్‌ వెల్లడించారు. బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ ఈవో రవిచంద్ర తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు స్వామివారిని మొత్తం 5.76 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, హుండీ ద్వారా రూ.29 కోట్ల ఆదాయం లభించిందని ఆయన వివరించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేశామని, ఈ వ్యవధిలో 21.80 లక్షల మందికి అన్నప్రసాదాలు అందించగా, 2.04 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని తెలిపారు. రికార్డు...